మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది.
ఈ క్రమంలోనే విశ్వంభర మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘రామ రామ..’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ లో బాల ఆంజనేయులతో చిరంజీవి ఉన్న కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుటుంది.
ఇప్పుడు ఈ రామ రామ గీతానికి సంబందించిన ప్రోమో విడుదల చేశారు. రామజోగయ్య రాశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ ను విజయవాడకు సమీపంలో ఉన్న నందిగామలోని పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విడుదల చేయనున్నారు.
ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహం ప్రపంచంలోనే రెండో అత్యంత పొడవైన హనుమాన్ విగ్రహం అనే సంగతి తెలిసిందే. ఇక ఈ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరాముడి బ్యాక్డ్రాప్లో వచ్చే ఈ ‘రామ రామ..’ సాంగ్ అభిమానుల్ని అలరించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

