టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మే 9న సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ చేసే నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న డైరెక్టర్ కిశోర్ తిరుమలతో రవితేజ తన తర్వాతి సినిమా చేయనున్నాడని సమాచారం.
ఇటీవలే రవితేజకు (Ravi Teja) కిషోర్ తిరుమల (Kishore Tirumala) ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ వినిపించారట. రవితేజకు కూడా ఆ స్క్రిప్ట్ బాగా నచ్చిందని తెలుస్తున్నది. ఈ వేసవి నుంచే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అనార్కలి’ (Anarkali) అనే టైటిల్ను ఫిక్స్ చేశారని.. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలో రవితేజకు (Ravi Teja) జోడీగా కయాదు లోహర్, మమతా బైజు హీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

