సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం

by | Mar 5, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ సెమి ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై, న్యూజిలాండ్ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది

మార్చ్ 9 న, దుబాయ్ వేదికగా భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది

363 పరుగుల భారీ స్కోర్ ను చేధించడానికి బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడే క్రమంలో ఓపెనర్ రికెల్టన్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే రెండవ వికెట్ కు కెప్టెన్ బావుమా, డుస్సేన్ లు 105 పరుగులు జోడించారు  

56 పరుగులు చేసిన కెప్టెన్ బావుమా అవుట్ అయినా తరవాత నుండి సౌత్ ఆఫ్రికా కష్టాలు మొదలయ్యాయి.  కాసేపటికే 69 పరుగులు చేసిన డుస్సేన్ కూడా అవుట్ అవ్వడంతో సౌత్ ఆఫ్రికా పీకల లోతు కష్టాలో పడింది. 

ఆ తరవాత వచ్చిన మార్క్రమ్ 31 పరుగులు, క్లాసెన్ 3 పరుగులు చేసి అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా గెలుపుపై అభిమానులు ఆశలు వదులుకున్నారు.  అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా, డేవిడ్ మిల్లర్ మాత్రం అడపా, దడపా షాట్ లతో స్కోర్ బోర్డు ని కదిలిస్తున్నాడు.  అయితే ఛేదించాల్సిన లక్ష్యం కొండంత ఉంది.  చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్న పరిస్థితి.

తొమ్మిదవ వికెట్ కు మిల్లర్, రబడా లు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిల్లర్  ధాటిగా ఆడడం మొదలు పెట్టేసరికి ఓవర్ లు కరిగిపోయి,  చేధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగింది. చివరకు మిల్లర్ 67 బంతుల్లో 100 పరుగులు చేశాడు.  పడవ వికెట్ కు ఎంగిడి తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో ఎంగిడి ఒక పరుగు మాత్రమే చేశాడు

న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్ మూడు వికెట్లు తీయగా, హెన్రీ, ఫిలిప్స్ లు రెండేసి వికెట్ లు తీశారు. రచిన్ రవీంద్ర, బ్రే స్ వెల్, చెరో ఒక వికెట్ తీశారు

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ల లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు చక్కని శుభారంభం లభించింది.  ఓపెనర్ లు విల్ యంగ్, రచిం రవీంద్ర మొదటి వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

ఓపెనర్ విల్ యంగ్ 21 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.  ఆ తరవాత వచ్చిన విలియమ్సన్ తో జత కలిసిన రచిన్ రవీంద్ర అద్భుతం గా ఆది రెండవ వికెట్ కు వీరిద్దరూ 164 పరుగులు జోడించి న్యూజిలాండ్ ను పటిష్ట స్థితిలో పెట్టారు.

సెంచరీ లు పూర్తిచేసుకున్న  తరవాత రచిన్ రవీంద్ర, విలియమ్సన్ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు.  విలియమ్సన్ 102 పరుగులు, రచిన్ రవీంద్ర 108 పరుగులు చేసి అవుట్ అయ్యారు

లేదమ్ నాలుగు పరులుగలకే అవుట్ అయ్యిన, మిచెల్, ఫిలిప్స్ లు ఐదవ వికెట్ కు 57 పరుగులు జోడించారు.  37 బంతుల్లో 49 పరుగులు చేసిన మిచెల్ అర్ధ సెంచరీ ని ఒక పరుగుతో మిస్ చేసుకున్నాడు.  గ్లెన్ ఫిలిప్స్ 27 బంతుల్లో 49 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు

సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో ఎంగిడి మూడు , రబడా రెండు వికెట్లు తీయగా ముల్డర్ ఒక వికెట్ తీశాడు.