ఫ్యాన్స్‏కు big న్యూస్.. 1000 మంది డ్యాన్స‌ర్ల‌తో మెగా హీరో సాంగ్!

by | Mar 5, 2025 | సినిమా

ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. 1000 మంది డ్యాన్స‌ర్ల‌తో మెగా హీరో సాంగ్!

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌(Sai Durga Tej), యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హనుమాన్ (Hanuman) మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోంది. ఆర్కాడీ అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్‌ డ్రామాలో సాయిదుర్గతేజ్‌ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరో సాయి దుర్గా తేజ్‌ ఎంట్రీ సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు రంగంలోకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం హైద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో దినేష్ మాస్టర్ కొరియోగ్రఫిలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సాంగ్ లో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు పాల్గొనబోతున్నారట. ఇంత మంది డ్యాన్స‌ర్ల‌తో మెగా మేనల్లుడు డ్యాన్స్ చేస్తుంటే థియేట‌ర్‌లు ఏ రేంజ్‌లో ఊగిపోతాయో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ మూవీలో విజువ‌ల్ ఫీస్ట్ గా నిలుస్తుంద‌ని చిత్రబృందం అంటున్నారు. కాగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ సంజయ్‌దత్‌ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే జగపతిబాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తుండగా.. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.