సిద్ధు ‘జాక్‌’ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Mar 6, 2025 | సినిమా

గతేడాది టిల్లు స్క్వేర్‌తో (Tillu Square) ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్‌'(Jack). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) ఓ డిఫరెంట్​ స్టోరీని సిద్ధం చేశారట. ఇందులో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు.

ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధు కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ . ‘హు ఇజ్ పాబ్లో నెరుడా సాంగ్ ను మార్చి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. దీంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.