ఈ రోజు శ్రీ రామ నవమి పండగ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలలో ఎన్నో భక్తిరస చిత్రాలు వచ్చాయి. శ్రీ రాముడి జీవితం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఇప్పటికి శ్రీ రామ నవమి పండగ రోజు టీవీ లలో ప్రసారమవుతుంది.
రామాయణ కధా సారాన్ని 13 నిమిషాలలో చెప్పిన ఘనత సీనియర్ సముద్రాల గారికి దక్కుతుంది. 1963 లో వచ్చిన వాల్మీకి చిత్రం లో శ్రీ రామాయణ కావ్య సుధ ద్వారా రామాయణం మొత్తాన్ని 13 నిమిషాలలో చెప్పారు మన ది గ్రేట్ సీనియర్ సముద్రాలగారు. ఆ రామాయణ కావ్య సుధకు అంతే అద్భుతంగా స్వరాలూ సమకూర్చి, అంతే అద్భుతంగా పడిన ఘనత మన ఘంటసాల మాస్టర్ కు దక్కుతుంది. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఒక్కసారి మీరు ఈ శ్రీ రామాయణ కావ్య సుధను ఆలకించండి
శ్రీ రామచంద్రుడు ఆధారంగా తీసిన తెలుగు సినిమాలలో కొన్ని గుర్తుకు తెచ్చుకుందాం
శ్రీ రామ పాదుక పట్టాభిషేకం లవ కుశ సంపూర్ణ రామాయణం సీతారామ జననం సీతారామ కళ్యాణం వీరాంజనేయ సంపూర్ణ రామాయణం సీత కళ్యాణం బాల రామాయణం శ్రీ రామ రాజ్యం ఆదిపురుష్

