భారత సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి కన్నడ ప్రముఖ నటుడు యశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా సీత పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కనిపించనుంది. అలాగే రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయణ (Ramayanam) చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా తాజాగా ముంబైలో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రణబీర్ కపూర్, యశ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మార్చి మూడో వారం నుంచి ముంబై శివార్లలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో యశ్ తో పాటుగా ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురాబోతునట్లు దర్శకుడు నితీశ్ తివారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను దీపావళి కానుకగా 2026లో అలాగే రెండో పార్టును దీపావళి కానుకగా 2027లో తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

