ఇండియా టుడే 2025 కాంక్లేవ్ లో మాట్లాడిన రేవంత్ గుజరాత్ మోడల్ టెస్ట్ మ్యాచ్ లాంటిది. అవుట్ డేటెడ్ అని అన్నారు. భాజపా దేశాభివృద్ధికి కు గుజరాత్ ను ఒక మోడల్ గా చూపిస్తోంది అని హోస్ట్ అనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా తెలంగాణ టి 20 మోడల్ అని అన్నారు. దేశానికి కావలసిన మోడల్ తెలంగాణ అని అన్నారు. గుజరాత్ మోడల్ కి ఎలాంటి వెల్ఫేర్ లేదు అని అన్నారు
ఒక 5 సంవత్సరాలు తరవాత వచ్చి చూడండి, ప్రపంచంలోనే అత్యుతమ నగరాన్ని నిరశ్మిస్తున్నాము (హైదరాబాద్) అని రేవంత్ రెడ్డి అన్నారు. భారత దేశంలో తయారయ్యే బల్క్ డ్రగ్స్ లో 35% హైదేరాబద్ నుండి వచ్చినదే. అంతే కాకుండా 1/3 వంతు కోవిడ్ వాక్సిన్లు తెలంగాణ నుండి వచ్చినవే
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ల కు రేజర్వేషన్లు ఇచ్చింది. మేము ఓబీసీ లకు వారి వాటిని ఇవ్వాలనుకుంటున్నాము. మండల్ కమిషన్ ఓబీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తోంది. మేము దానిని పెంచాలనుకుంటున్నాము
అంతే కాకుండా ఇండియా టుడే 2025 కాంక్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇంకా ఏమ్మన్నారంటే, మేము (హైదరాబాద్), అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు లతో పోటీ పడాలనుకోవడంలేదు. మేము న్యూ యార్క్, సియోల్ వంటి నగరాలతో పోటీ పడాలనుకుంటున్నాము. నా తెలంగాణ మోడల్ తో ఎవరు పోటీ పడలేరు
ఇంకా యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయి, హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ ను చంద్రబాబు, వైస్సార్ కు ఇస్తూ ఉంటె, రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. ఈ అభివృద్ధి కులీ కుతుబ్ షా, నిజాం, బ్రిటిషర్లు, చిన్న రెడ్డి ల నుండి అంటే 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ను మేము అభివృద్ధి కంటిన్యూ చేస్తున్నాము అని అన్నారు
తెలంగాణ కోర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అని అన్నారు

