ఛాంపియన్స్ ట్రోఫీ లో వరుస విజయాలతో ఫైనల్ కు వచ్చిన భారత జట్టు న్యూజిలాండ్ ను ఓడించి కప్ కొట్టేస్తుందా
రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ట్రోఫీ ఫైనల్ (ICC Trophy final) కు రావడం ఇది నాలుగవ సారి. గత మూడు సార్లలో ఒక సారి మాత్రం కప్ గెలిచారు
అయితే చరిత్ర ఏం చెపుతోందో ఒక సారి చూద్దాం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ స్టేజి లో పాకిస్థాన్ ను ఓడించిన భారత జట్టు ఫైనల్ లో పాక్ చేతిలో ఓడిపోయింది. మళ్ళీ 2023 వన్ డే ప్రపంచ కప్ లో భారత జట్టు గ్రూప్ స్టేజి లో ఆస్ట్రేలియా ను ఓడించింది. అయితే ఫైనల్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజి లో భారత జట్టు న్యూజిలాండ్ ని ఓడించింది. మారి ఈ సారి ఫైనల్ లో ఈ గండం నుండి గట్టెక్కి చరిత్రను తిరగ రాస్తారా.
అంతే కాదు ఇటీవల స్వదేశం లో జరిగిన టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన భారత జట్టుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా వచ్చింది
భారత జట్టు గెలవాలని కోరుకుంటూ…టీం ఇండియా(Team India) కి బెస్ట్ విషెస్

