‘కన్నప్ప’ నుంచి అదిరిపోయే లవ్ సాంగ్

by | Mar 9, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు (Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్‌ హీరోయిన్‌. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సెకండ్ సింగిల్ ముహూర్తం ఖరారైంది. లవ్ సాంగ్ గా రానున్న ఈ సెకండ్ సింగిల్ ను మార్చి 10న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. కన్నప్ప జీవితంలో ప్రేమ కోణం కూడా ఉందని.. అది అభిమానులను అలరించే రీతిలో చూపెట్టబోతున్నామని చిత్ర బృందం చెబుతోంది.

అంతకుముందు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ శివా శివా శంకరా సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇక ఈ మూవీ థియేట్రికల్ హక్కుల కోసం పలు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప (Kannappa) చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో
ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) , మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్‌, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప (Kannappa) మూవీ ఏప్రిల్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.