తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. వీరితోపాటు మలయాళ, హిందీ భాషల నుంచి కూడా చాలా మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ కడుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ సాలిడ్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ అభిమానులకు ప్రత్యేక రోజున ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ నూతన సంవత్సరాది కానుకగా ఈ ఏప్రిల్ 14న ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. కాగా, యాభై ఏళ్ళ కాల వ్యవధిలో జరిగే ఈ కథలో దేవాగా పవర్ఫుల్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయని, కథలో ఊహించని మలుపులు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా.. ఈ మార్చి చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని బావిస్తున్నారట మేకర్స్.

