WPL :  హోరా హోరి పోరులో యూపీ వారియర్స్ విజయం

by | Mar 8, 2025 | Uncategorized

WPL :  హోరా హోరి పోరులో ఆర్సీబీ పై యూపీ వారియర్స్ విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్స్ మధ్య జరిగిన  మ్యాచ్ లో యూపీ వారియర్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

226 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 19.3 ఓవర్ల లో 213 పరుగులకు అల్ అవుట్ అయ్యింది. మొదటి నుండి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది

కెప్టెన్ స్మ్రితి మందన 4 పరుగులకే అవుట్ అయినా, లక్ష్యం భారీగా ఉండడంతో, ధాటిగా ఆడిన మేఘన 12 బంతుల్లో 27 పరుగులు, పెర్రీ 15 బంధుల్ప్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు

ఆ తరవాత వచ్చిన రిచ్ ఘోష్ ఒక్కసారిగా యూపీ వారియర్స్ బౌలర్ల పై విరుచుకు పడింది. 33 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఇందులో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి

ఆఖరులో స్నేహ రానా మెరుపులు మెరిపించి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు లో సరికొత్త ఆశలు పుట్టించింది. స్నేహ రానా 6 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.   అయితే స్నేహ రానా ను దీప్తి శర్మ అవుట్ చేయడంతో మ్యాచ్ యూపీ వారియర్స్ చేతుల్లోకి వచ్చేసింది 

యూపీ వారియర్స్ బౌలర్ల లో సోఫీ 3 వికెట్లు తీయగా,  దీప్తి శర్మ, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. సర్వాణి  ఒక వికెట్ తీశారు.

యూపీ వారియర్స్ విమెన్ ప్రీమియర్ లీగ్ నుండి నిష్క్రమించింది. అయితే వెళుతూ, వెళుతూ భారీ స్కోర్ చేసి రాయల్ చాలెంజర్స్ ను ఓడించి ఆర్సీబీ ని కష్టాల్లోకి నెట్టింది. గెలవాల్సిన కీలక మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయింది.  గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు వెళ్లినట్లేనా.  ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే క్వాలిఫై అయ్యింది

అంతకు ముందు, టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఓపెనర్ లు  గ్రేస్ హారిస్, జార్జియ వోల్ లు ధాటిగా ఆడుతూ మొదటి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . గ్రేస్ హారిస్ 22 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యింది వన్ డౌన్ లో వచ్చిన కిరణ్ నవగిరే, మరో ఓపెనర్ జార్జియ వోల్ లు మహిళా దినోత్సవం రోజున ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.  రెండవ వికెట్ కు వీరిద్దరూ 70 పరుగులు జోడించారు.

కిరణ్ నవగిరే కేవలం 16 బంతుల్లో 46 పరుగులు చేసింది. ఇందులో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.  మరో ఓపెనర్  జార్జియ వోల్ 56 బంతుల్లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.  ఒక పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకుంది. ఈ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి

యూపీ వారియర్స్ జట్టులో బ్యాటింగ్ చేసిన ప్లేయర్స్ అందరి స్ట్రైక్ రేట్ 100 పైగానే ఉంది. మహిళా దినోత్సవం రోజు విమెన్ పవర్ చూపించారు

ఆర్సీబీ బౌలర్ల లో వారెహామ్ రెండు వికెట్లు , డీన్ ఒక వికెట్ తీశారు. ఇద్దరు రన్ అవుట్ అయ్యారు