ఐ బొమ్మ రవి ని, పైరసీ ని సమర్థిస్తున్నారా…ఆర్జీవీ రిప్లై

by | Nov 22, 2025 | వార్తలు

21 వేల సినిమాలను పైరసీ చేసిన ఐ బొమ్మ రవి కి సోషల్ మీడియా లో మద్దతు లభిస్తోంది.  ఈ మద్దతు ఇచ్చేవారంతా ఇప్పటిదాకా ఐ బొమ్మలో ఫ్రీ గా సినిమా చూసినవాళ్ళే. ఒక వైపు ఇమ్మడి రవి ని అరెస్ట్ చేయడం పై సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తుంటే కొంత మంది సోషల్ మీడియా లో సినిమా పెద్దలను, పోలీస్ ల మీద కామెంట్ చేస్తున్నారు.

పైరసీ ని ఆపలేము అని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. పైరసీ సినిమాలు చూసే వాళ్ళు ఉన్నంతవరకు రవి లాంటి వాళ్ళు పైరసీ సినిమాలు చూపిస్తూనే ఉంటారు. పైరసీ చేయడం ఖచ్చితంగా తప్పే.  ఐ బొమ్మలో పైరసీ సినిమాలు చూసేవాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళే. 

కొంత మంది సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. సమాజానికి ఏ చేస్తున్నారు అని అంటున్నారు.  మరికొందరు థియేటర్ లో పాప్ కార్న్ రేట్లు ఎక్కువ అంటాడు. అక్కడికి పాప్ కార్న్ సినిమా వాళ్ళు అమ్ముతున్నట్లు.  సోషల్ మీడియా ని అసూయ, అసమర్ధత ని చూపించడానికి వాడుకుంటున్నారు. 

రోడ్డు పక్కన బండి మీద ప్లేట్ ఇడ్లి 30 రూపాయలకు వస్తుంది, చిన్న హోటల్ లో ఒక రేట్ ఉంటుంది. చట్నీస్ లాంటి పెద్ద హోటల్ లో ప్లేట్ ఇడ్లి ధర యెక్కువగా ఉంటుంది.  ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు డబ్బులు పెట్టి తింటారు.  

ఖర్చులు పెరుగుతున్నాయని అవతలి వాళ్ళను రేట్లు తగ్గించమని అనే బదులు ఎవరికి వారు మనం ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి,  ఆదాయం ఎలా పెంచుకోవాలి అని ఆలోచించాలి కదా.

సినిమాలో నటించడం అందరికి రాదు, సినిమాలలో నటించడం వెనక చాలా కష్టం ఉంటుంది. వారి కష్టాన్ని బట్టి నిర్మాతలు లెక్కలు వేసుకుని చేసే వ్యాపారం ఇది. సినిమా పరిశ్రమలో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.  రాజమౌళి వచ్చాక తెలుగు సినిమా పరిశ్రమ వ్యాపార పరిధి ప్రపంచ స్థాయికి చేరింది

ఈ రోజు కు తక్కువ ఖర్చుతో ఎక్కవ సేపు వినోదం అందించే పరిశ్రమ ఉందంటే అది సినీ పరిశ్రమ.  సినిమా బాగుంటే చూస్తారు లేకపోతే చూడరు. 

సోషల్ మీడియా లో ఐ బొమ్మ రవి అరెస్ట్, పైరసీ పై రామ్ గోపాల్ వర్మ ఘాటైన సమాధానం చెప్పాడు.