రెండవ టెస్ట్ : నిలిచి తడబడిన సౌత్ ఆఫ్రికా

by | Nov 22, 2025 | వార్తలు

భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు గౌహతి లో ప్రారంభమైన రెండవ టెస్ట్ లో టాస్ గెలిచినా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 

ఓపెనర్లు రికెల్టన్, మార్కరం లు మొదటి వికెట్ కు 82 పరుగులు జోడించారు. అయితే వీళ్లిద్దరు వెంట వెంటనే అవుట్ అవుట్ అయ్యారు.  రికెల్టన్  35 పరుగులు, మార్కరం 38 పరుగులు చేసి అవుట్ అయ్యారు

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బావుమా, స్టబ్స్  లు మూడవ వికెట్ కు 84 పరుగులు జోడించారు. 41 పరుగులు చేసిన బావుమా అవుట్ అయ్యాక, 49 పరుగుల వద్ద స్టబ్స్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ముల్డర్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే జార్జి, ముత్తు స్వామి లు కొంత సేపు నిలబడి ఆరవ వికెట్ కు 45 పరుగులు జోడించారు. జార్జి 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ముత్తుస్వామి 25 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు

భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్, జడేజాలు తలా ఒక వికెట్ తీశారు. భారత జట్టు ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ సమం చేసే అవకాశం ఉంటుంది. ఓడిపోయినా, డ్రా అయినా సిరీస్ సౌత్ ఆఫ్రికా కు కోల్పోయే అవకాశం ఉంది.