వారణాసి టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. ఇదే వేడుకలో సాంకేతిక కారణాల వలన వారణాసి టైటిల్ గ్లిమ్ప్స్ భారీ స్క్రీన్ లో ప్లే అవలేదు. తర్వాత ప్లే చేశారు. అయితే ఈ లోగా సహనం కోల్పోయిన రాజమౌళి ‘నేను దేవుడిని నమ్మను. మా నాన్న మాట్లాడుతూ ఆంజనేయ స్వామి నా వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు అని అన్నారు. ఆ మాటలకూ కూడా రాజమౌళి కౌంటర్ గా ఇదేనా నడిపించేది అని అసహనంగా మాట్లాడారు.
అయితే తర్వాత టైటిల్ గ్లిమ్ప్స్ ప్లే అయినా మాటలను మాత్రం వెనక్కు తీసుకోలేరుగా. సోషల్ మీడియాలో బాయ్ కాట్ వారణాసి అనే వరకు వచ్చింది. అయినా రాజమౌళి స్పంచిండంలేదు. సినిమా విడుదలకు ఇంకా 18 నెలలు సమయం ఉంది. అలోచించి నిదానంగా మాట్లాడం మంచిదని రాజమౌళి అనుకోవచ్చు
సోషల్ మీడియా లో రాజమౌళి గురించి ఎవరు ఎలా మాట్లాడినా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం రాజమౌళి కి మద్దతు గా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రాజమౌళి గురించి సోషల్ మీడియాలో నెగటివ్ గా మాట్లాడే వాళ్లకు రామ్ గోపాల్ వర్మ ఇచ్చి పడేశాడు. లాజిక్ తో ఘాటుగా గట్టి రిప్లై ఇచ్చాడు. ఎవరైతే రాజమౌళి మీద విమర్శలు చేస్తున్నారో వారంతా వర్మ పోస్ట్ చదివాకా లాజిక్ తో అలోచించి మాట్లాడాలేమో.

