ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు పెర్త్ లో ప్రారంభమైన మొదటి టెస్ట్ లో మొదటి రోజు 19 వికెట్లు పడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, మొదటి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
బ్రూక్ 52 పరుగులు, పొప్ 46 పరుగులు, స్మిత్ 33 పరుగులు చేశారు. జో రూట్ డక్ అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 7 వికెట్లు తీయగా, బ్రెండన్ డాగెట్ రెండు వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ ను 172 పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం ఆస్ట్రేలియా కు ఎక్కువసేపు ఇవ్వలేదు ఇంగ్లాండ్ బౌలర్లు.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్.
హెడ్ 21 పరుగులు, గ్రీన్ 24 పరుగులు, స్టీవ్ స్మిత్ 17 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీయగా, కార్స్, జోఫ్రా ఆర్చర్ లు చెరో రెండు వికెట్లు తీశారు
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 49 పరుగులు వెనకబడి ఉంది. ఆస్ట్రేలియా లో ఎలాగైనా యాషెస్ సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్ జట్టు.

