బాల కృష్ణ హీరో గా నటించిన అఖండ-2 చిత్ర ట్రైలర్ విడుదలయింది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా అఖండ-2. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అఖండ 2 ట్రైలర్ కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపుర లో విడుదల చేశారు.
అఖండ 2 చిత్రం సనాతన ధర్మం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ అంటేనే పదునైన సంభాషణలు, ఫైట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి. థమన్ ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు
నార్త్ ప్రేక్షకులను అఖండ 2 ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మన తెలుగు మార్కెట్ లో మాత్రం అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ-2 వస్తోంది

