మెగా ఫ్యాన్స్‌ సిద్ధమా.. ‘పెద్ది’ టీం అదిరిపోయే అప్‌డేట్‌

by | Apr 4, 2025 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన చిత్ర‌బృందం శ్రీరామిన‌వ‌మి కానుక‌గా స్పెష‌ల్ అప్‌డేట్‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకుంది. పెద్ది (Peddi) సినిమా నుంచి ఫ‌స్ట్ షాట్‌ను శ్రీరామి న‌వ‌మి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యం తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానకు మెగా దంపతులు రామ్ చరణ్, ఉపాసన ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బుచ్చిబాబు సానకు శ్రీరామ పాదుకలతో పాటుగా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని తాజాగా బుచ్చిబాబు సాన సోషల్ మీడియాలో షేర్ చేసి.. రామ్ చరణ్-ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల రామ్ చరణ్ 40వ పుట్టినరోజు వేడుకలను హైద్రాబాద్ లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలెబ్రెట్ చేశారు. ఈ కార్యక్రమంలోనే బుచ్చిబాబు సానకు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగినట్లు తెలుస్తోంది.