అమెరికా నుండి అధిక ఆదాయం పొందుతోన్న ఇండియన్ కంపెనీలు
అమెరికా నుండి ఎక్కువ ఆదాయం పొందుతోన్న భారతీయ కంపెనీ లు చాలానే ఉన్నాయి. అందులో టాప్ 25 కంపెనీలు ఏమున్నాయో చూద్దాం.
వీటిలో ఎక్కువగా ఫార్మా మరియు సాఫ్ట్ వేర్ సర్వీసెస్ కంపెనీ లు ఉన్నాయి. ట్రంప్ ఏమనుకున్నాడో ఏమో ఫార్మా రంగానికి ఈ సుంకాల నుండి మినహాయింపు ఇచ్చాడు
అమెరికా ప్రజలకు తక్కువ ధరలో మందులు అందించడం లో మన ఫార్మా కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మన దేశం నుండి దాదాపుగా 9 బిలియన్ డాలర్ల మందులు అమెరికా కు ఎగుమతి అవుతాయి. కాబట్టి ఈ మందులపై సుంకాలు విధిస్తే ఇది అమెరికా ప్రజల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అందుకే ట్రంప్ ఫార్మా రంగం జోలికి వెళ్ళలేదు.
ఇక సాఫ్ట్ వేర్ సర్వీసెస్ రంగానికి వస్తే ఈ రంగం పై ప్రత్యక్ష సుంకాలు ఏమి లేవు కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అమెరికా కొత్త పాలసీ లకు అనుగుణంగా ప్రైసింగ్ స్ట్రాటజీ, ఆపరేషన్స్ స్ట్రాటజీ లతో, మార్కెట్ కు అనుగుణం గా కంపెనీ లను రెడీ చేయాలి
ట్రంప్ సుంకాల వాళ్ళ అంత పెద్ద ప్రమాదం ప్రస్తుతానికి ఏమి లేదు కానీ అప్రమత్తంగా ఉండడం అవసరం. అమెరికా సుంకాల వలన మన జి డి పి వృద్ధి 0.3% నుండి 0.6% తగ్గవచ్చు అని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు
| S No | Company | Sector | Revenue from USA |
| 1 | Sagility India | Business Support | 100% |
| 2 | Birla Soft | Software Services | 85.7% |
| 3 | Mphasis | Software Services | 81.43% |
| 4 | Granules India | Pharmaceuticals | 77% |
| 5 | eClerx Services | Software Services | 76% |
| 6 | Natco Pharma | Pharmaceuticals | 70.49% |
| 7 | Avanti Feeds | FMCG | 69% |
| 8 | Zensar Technologies | Software Services | 67.3% |
| 9 | First Source Solution | Software Services | 66.3% |
| 10 | HCL Tech. | Software Services | 65.5% |
| 11 | Syngene International | Business Support | 64.66% |
| 12 | Wipro | Software Services | 62.68% |
| 13 | Coforge | Software Services | 56.0% |
| 14 | Gland Pharma | Pharmaceuticals | 52.69% |
| 15 | Marksans Pharma | Pharmaceuticals | 51.8% |
| 16 | Tech Mahindra | Software Services | 50.8% |
| 17 | Dr Reddy’s Lab | Pharmaceuticals | 48.56% |
| 18 | Aurobindo Pharma | Pharmaceuticals | 45.3% |
| 19 | Zydus Lifesciences | Pharmaceuticals | 44.89% |
| 20 | Bharat Forge | Forging & Casting | 44.33% |
| 21 | Biocon | Pharmaceuticals | 43.75% |
| 22 | Neuland Laboratories | Pharmaceuticals | 39.54% |
| 23 | Trident | Textiles | 39.28% |
| 24 | LT Foods | FMCG | 38.53% |
| 25 | Lupin | Pharmaceuticals | 38.00% |

