మోగ్లీ కోసం, రామ్ చరణ్, నాని…అయితే

by | Aug 30, 2025 | సినిమా

సుమ (Suma), రాజీవ్ కనకాల దంపతుల కొడుకు రోషన్ కనకాల.  రోషన్ కనకాల హీరోగా బబ్లుగం సినిమాతో తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.  అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.  ఆ తరవాత టెలివిజన్ లో, ఓ టీ టీ లో సినిమా ప్రభావం చూపించలేకపోయింది.

ఇప్పుడు తన రెండవ సినిమా మోగ్లీ (Mogli) glimpse విడుదల చేశాడు.  Glimpse విడుదల దగ్గరనుండి ప్రొమోషన్స్ మీద దృష్టి పెట్టినట్లున్నాడు.  డిజిటల్ glimpse ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  విడుదల చేయగా, ఈ glimpse కు నాచురల్ స్టార్ నాని (Nani) వాయిస్ అందించాడు.

అయితే మోగ్లీ(Mogli) Glimpse చూస్తే ఇది కూడా ఒక రొటీన్ ప్రేమ కధలా ఉంది.  కాకపోతే ఈ సినిమాకు, తన మొదటి సినిమా కలర్ ఫోటో (Colors Photo) తో జాతీయ అవార్డు పొందిన సందీప్ రాజ్, ఈ మోగ్లీ (Mogli) చిత్రానికి రచయిత, దర్శకుడు.  ఆశలన్నీ సందీప్ రాజ్ మీదే. 

ఈ మోగ్లీ (Mogli) కూడా ప్రేమ, పగలతో నిండి ఉన్న సినిమాల ఉంది.  ఆడవి నేపథ్యంలో సాగే ప్రేమ కధలా ఉంది. రోషన్ కనకాల నటన బాగానే ఉన్న, కధ చాల ముఖ్యం.  ఓ టి టి ల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించాలంటే విభిన్నమైన కధ ఉండాలి.  కొత్తగా రోషన్ కనకాల హార్స్ రైడింగ్ స్కిల్స్ చూపిస్తున్నట్లు ఉంది, ఈ సినిమాలో

ఈ Glimpse చూస్తే చిరుత సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) ని చూసినట్లు ఉంది.  నాని (Nani) వాయిస్ ఓవర్ ఈ Glimpse కు హైలైట్ అని చెప్పవచ్చు

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై, టి జి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మిరాయ్ (Miraai)  రాజా సాబ్ (Raja Saab) చిత్రాలకు కూడా ఈయనే నిర్మాత.