మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమాని – మెగా అభిమానం

by | Aug 29, 2025 | ప్రగడ టీవీ

సినిమా హీరోలు చాలా మందికి డెమి గాడ్ లాగా కనిపిస్తారు. విషయం ఏంటంటే, కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే మెగా వీరాభిమాని సైకిల్ పై హైదరాబాద్ వచ్చి చిరంజీవిని కలిశారు. 300 కిలో మీటర్లు సైకిల్ తొక్కుకుని వచ్చి మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పై తన మెగా అభిమానాన్ని చాటుకున్నారు.

అంత దూరం నుండి వచ్చిన మెగాభిమాని రాజేశ్వరి (Rajeswari) కి మెగా స్వాగతం లభించింది.  చిరంజీవి (Chiranjeevi) కి రాఖి కట్టి తెగ సంబరపడిపోయింది. తనతో పాటు తన పిల్లలను కూడా తీసుకు వచ్చారు. చిరంజీవి కూడా ఆప్యాయంగా మాట్లాడు ఆమెకు చీర బహుకరించారు. పిల్లలకు గిఫ్ట్ లు కూడా అందించారు.  అంతే కాదు పిల్లల చదువు కు అయ్యే ఖర్చు తాను భరిస్తానని మాట ఇచ్చారు.  పిల్లలతో మాట్లాడుతూ మీరు బాగా చదువుకుని అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పారు.

ఊరికే అనలేదు.  చిరంజీవి ని మెగా స్టార్ అని.  ఒక్కడే మెగాస్టార్.

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) 70 వ పుట్టిన రోజు నుండి, కొత్త టీం పని చేస్తోంది.  టీం మెగాస్టార్ (Team Mega Star) అని ఎక్స్ లో ఖాతా తెరిచారు కూడా.