జీ తెలుగు (Zee Telugu) సరికొత్త నాన్ ఫిక్షన్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (Jayammu Nischayammura) ఈ ఆగస్టు నెల 17 నుండి ప్రారంభమయ్యింది.
ఈ షో గతంలోనే జీ తెలుగు లో వచ్చిన కొంచెం టచ్ లో ఉంటె చెప్తా షో కి దగ్గరగా ఉంటుంది. అప్పట్లో ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేశాడు. ఇప్పుడు ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో కి జగపతి బాబు (Jagapathi Babu) యాంకరింగ్ చేస్తున్నాడు.
ఆగష్టు 14 న నాగార్జున నటించిన కూలీ (Coolie) సినిమా విడుదలైన సందర్భంలో, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మొదటి ఎపిసోడ్ కి అతిధిగా కింగ్ నాగార్జున (Nagarjuna) వచ్చాడు. ఈ ఎపిసోడ్ ను జీ 5 లో మూడు రోజుల ముందు అంటే ఆగష్టు 15 న స్ట్రీమింగ్ చేశారు. ఆగష్టు 17 న జీ తెలుగు (Zee Telugu) లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యింది.
‘జయమ్ము నిశ్చయమ్మురా షో రేటింగ్స్ నాగార్జున (Nagarjuna) పుట్టిన రోజు అయిన ఆగష్టు 29 న, అంటే ఈ రోజు వచ్చాయి. నాగార్జున ఎపిసోడ్ కి 2 రేటింగ్ పాయింట్లు మాత్రమే వచ్చాయి. అతి దారుణమైన రేటింగ్ అని చెప్పవచ్చు.
అయితే నాగార్జున ఎపిసోడ్ కి ఇలాంటి రేటింగ్ రావడానికి కారణాలు లేకపోలేవు. నాగార్జున (Nagarjuna) గురించి కొత్తగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సినవి ఏమి లేవు. ఈ షో ఫార్మటు కూడా అతి పురాతనమైనది. అంతే కాకుండా ఈ షో ని మూడు రోజుల ముందే జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ చేశారు. వీటన్నింటి వలన నాగార్జున ఎపిసోడ్ కి కేవలం 2 రేటింగ్ పాయింట్లు మాత్రమే వచ్చాయి.
రెండవ ఎపిసోడ్ లో శ్రీ లీల (Sree Leela) వచ్చింది. ఆ ఎపిసోడ్ ఎన్ని రేటింగ్ పాయింట్లు వస్తాయో చూడాలి. ఒక రకంగా జీ తెలుగు (Zee Telugu) కు ఈ రేటింగ్ పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

