ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) కు మాతృ వియోగం. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య (Allu Ramalingayya) గారి సతీమణి కనక రత్నమ్మ గారు కన్ను మూశారు. కనక రత్నమ్మ గారి వయసు 94 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో బాధ పడుతోన్న కనక రత్నమ్మ గారు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. కనక రత్నమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చిరంజీవి అన్నారని తెలిసింది. రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) లు షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రాలలో ఉన్నారు. వారు కూడా ఈ మధ్యాన్నానికి వస్తారని తెలిసింది. కనక రత్నమ్మ గారి మరణ వార్త తెలియగానే, బంధువులు, సినీ ప్రముఖులు అల్లు అరవింద్ (Allu Aravind) నివాసానికి చేరుకొని ఆమె పార్టీవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

