ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో (IPL) భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది
రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు సంజు శాంసన్, జైస్వాల్ లు మొదటి వికెట్ కు 49 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే సంజు శాంసన్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వచ్చిన రియాన్ పరాగ్ తో జైస్వాల్ రెండవ వికెట్ కు 56 పరుగులు జోడించాక, 30 పరుగులు చేసిన రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. పరాగ్ అవుట్ అయినా కాసేపటికే, 47 బంతుల్లో 75 పరుగులు చేసిన జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు
ధృవ్ జురెల్ నిలకడగా ఆడి 23 బంతుల్లో 35 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bangalore) బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్, హేజిల్ వుడ్, క్రునాల్ పాండ్య లు తలా ఒక వికెట్ తీశారు

