‘ఓదెల 2’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. డేట్‌ ఫిక్స్‌

by | Apr 13, 2025 | సినిమా

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్‌ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్‌, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్‌ నంది (Sampath Nandi) టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. కాంతార ఫేం అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేయగా.. ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను మరింత జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట హల్‌ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 14న సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ న్యూ లుక్‌ పోస్టర్ ఒకటి విడుదల చేశారు మేకర్స్‌. కాగా, ‘ఓదెల 2’ (Odela) సినిమా మొదటి భాగాన్ని మించి ఉండేలా భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించినట్లు నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. ఈ రోల్ కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుందని ఈ సినిమాలో తమన్నా (Tamannah) పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.