పుష్ప 2 టీవీ ప్రీమియర్ కు 60 మంది ప్రకటనదారులు

by | Apr 13, 2025 | టీవీ & ఓటిటి

ఈ రోజు పుష్ప- 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో సాయంత్రం 5.30 లకు ప్రసారమవుతోంది.

ఈ రోజే కన్నడ వెర్షన్ కలర్స్ కన్నడ ఛానల్ లో, మలయాళ వెర్షన్ ఆసియానెట్ లో ప్రసారమవుతోంది.  తమిళ్ వెర్షన్ మాత్రం రేపు స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారమవుతోంది

ఇప్పటిదాకా నాలుగు చానెల్స్ కలిపి 60 మందికి పైగా ప్రకటన దారులు వచ్చారు. ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం గా నిలిచింది పుష్ప-2.  అయితే సినిమా కంటెంట్ మీద కొన్ని విమర్శల లేకపోలేవు. 

నెట్ ఫ్లిక్స్ లో కొన్ని రోజులు హడావిడి చేసిన పుష్ప-2, ఆ తరవాత సైలెంట్ అయిపోయింది.  పుష్ప 2 ఎక్కువగా నార్త్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.

ఇది ఇలా ఉంటే, పుష్ప -2 కి కౌంటర్ గా,   జీ తెలుగు సూపర్ హిట్ కామెడీ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని రంగంలోకి దింపుతోంది. ఇది కాకుండా ఐపీల్ లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది.

మరి ఇన్ని అడ్డంకులు దాటి పుష్ప-2 ప్రకటనదారుల ఖర్చుకు విలువ తీసుకు వస్తాడా లేదా అనేది చూడాలి.