ఏళ్ళ తరబడి సినిమాలు తీసే రాజమౌళికి అంత అసహనమా!

by | Nov 16, 2025 | సినిమా

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏళ్ళ తరబడి సినిమాలు తీసే రాజమౌళికి అంత అసహనమా

రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో నిన్న రాత్రి జరిగిన వారణాసి (Varanasi) సినిమా లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి అసహనానికి గురయ్యాడు.  ఇండియాస్ బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ అని చెప్పారు.  లాంచ్ ఈవెంట్ కూడా అంత గొప్పగా లేదు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ లానే స్పీచ్ లు, సుమ హంగామా  తప్ప ఏమి లేదు.   కాకపోతే రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ వేసి, భారీ ఎల్ ఇ డి స్క్రీన్ మీద ఈ టైటిల్ గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు

లాంచ్ ఈవెంట్ లో సాంకేతిక కారణాలతో టైటిల్ గ్లిమ్ప్స్ సమయానికి ఎల్ ఇ డి స్క్రీన్ లో ప్లే అవలేదు. దీనితో సుమ కు ఎలా టైం పాస్ చేయాలో తెలియక ఆపసోపాలు పడింది. అసలే జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక్కడే రాజమౌళి అసహనానికి గురయి నోరు జారాడు.  తనకు దేవుడి మీద నమ్మకం లేదన్నాడు. అంతకు ముందు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్, రాజమౌళి వెనుక ఉండి, ఈ సినిమా తీయించారని అన్నారు.  గ్లిమ్ప్స్ ప్లే కాకపోవడంతో  అసహనంతో ఉన్న రాజమౌళికి కోపం వచ్చింది.  ఈ విషయాన్ని గురించి రాజమౌళి (Rajamouli) మాట్లాడుతూ ఇదేనా హనుమాన్ నడిపించేది అని అన్నారు     

ఒక 10 నిమిషాలు  గ్లిమ్ప్స్ ప్లే అవడం ఆలస్యం అయితేనే అంత అసహనానికి గురయితే ఎలా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏళ్ళ తరబడి సినిమాలు తీసే రాజమౌళికి అంత అసహనమా?

సాంకేతికత ఎక్కువగా వినియోగిస్తే సమస్యలు కూడా అలానే వస్తాయి. వాటిని పరిష్కరించుకోవాలి.  సాంకేతిక సమస్యలు వచ్చినంత మాత్రాన దేవుడి మీద నమ్మకం లేదు, ఇదేనా హనుమాన్ నడిపించేది అని నోరు జారడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.