మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోన్న లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. . ఎప్పటినుండో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోన్నదే. ఈ సినిమా పేరు ‘వారణాసి’. ఈ సినిమాలో ‘రుద్ర’ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఈ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన విలన్ పాత్రధారి ప్రిథ్వి రాజ్ సుకుమారన్ (కుంభ) ఫస్ట్ లుక్ ను, ఆ తరవాత శృతి హాసన్ పాడిన ఫస్ట్ సింగల్ ను విడుదల చేశారు. ఆ తరవాత హీరోయిన్ పాత్రధారి ప్రియాంక చోప్రా (మందాకినీ) ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
దుర్గ ఆర్ట్స్ పతాకంపై కే ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరు. ఎం ఏం కీరవాణి ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి
ఈ సినిమాలో 30 నిమిషాలపాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉందని , ఆ సీన్ అద్భుతంగా ఉందని, రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సినిమా కధ విజయేంద్ర ప్రసాద్, రచయిత కాంచి ఇద్దరు కలిసి తయారు చేశారు. ఈ సినిమాకు దేవా కట్టా సంభాషణలు రాశారు.



