ఎస్ ఎస్ రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) సినిమా హైలైట్స్

by | Nov 16, 2025 | సినిమా

దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న వారణాసి సినిమా హైలైట్స్ ఏంటో చూద్దాం

  • ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పేశారు
  • ఈ సినిమాలో 30 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతోంది రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు
  • ఈ సినిమా గ్లిమ్ప్స్ చూస్తే కచ్చితంగా వానర వీరులు, ఆంజనేయస్వామి కి సంబందించిన అద్భుత సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.
  • వారణాసి శివుడి క్షేత్రం. టైటిల్ గ్లిమ్ప్స్ లో రామాయణానికి సంబందించిన ఛాయలు కనపడుతున్నాయి.  మరో పక్క అవతార్ సినిమా, వైల్డ్ సఫారీ ఛాయలు కనపడుతున్నాయి.  వారణాసికి, రామాయణానికి రాజమౌళి లింక్ పెట్టి సోసియో, మైతో, ఫాంటసి సినిమాగా మలిచే అవకాశాలున్నాయి
  • ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్ పరంగా అవతార్ స్థాయిలో ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.  ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలు ఒక ఎత్తు.  వారణాసి (Varanasi) ఒక ఎత్తు.  వారణాసి సినిమాతో తెలుగు సినిమా విశ్వ వ్యాప్తం అవుతుందనే దానిలో సందేహం లేదు
  • ఈ సినిమా టైటిల్ గ్లిమ్ప్స్ చివరలో గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ అని వచ్చింది.  అంటే ఖచ్చితంగా ఈ సినిమా టైం ట్రావెల్ కు సంబంధించింది అని తెలుస్తోంది.  ఈ టైం ట్రావెల్ లో భాగంగానే వీళ్ళు కాలానికి ముందకు, వెనక్కు వెళ్లే అవకాశం ఉంటుంది.  ఇదే క్రమంలోనే గ్లోబ్ ట్రాటర్…అని రకాల ప్రపంచాలను మనకు పరిచయం చేస్తారని తెలుస్తోంది. 
  • విలన్ గా నటించిన ప్రిథ్వి రాజ్ సుకుమారన్ తాలూకు   కుంభ పాత్ర ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, విశ్వ శాస్త్రవేత్త మరియు రచయిత  అయిన స్టీఫెన్ హాకింగ్ ను గుర్తుకు తెస్తోంది.  ఈ పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని ప్రియాంక చోప్రా చెప్పారు. 
  • ఈ టైం ట్రావెల్ లోనే ప్రియాంక చోప్రా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించవచ్చు
  • ఈ సినిమా ను, పూర్తి ఐ మాక్స్ ఫార్మటు లో తీస్తున్నారు

నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం (Ramayanam) మొదటి భాగం 2026 దీపావళికి వస్తుంది.  ఈ సినిమా విడుదలయిన తరవాత 2027 సమ్మర్ లో వారణాసి వస్తుంది.  నితీష్ తివారి  రామాయణం చూసి, తన సినిమాలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ వారణాసిని, రాజమౌళి (Rajamouli) ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలుస్తాడనడంలో సందేహం లేదు. 

చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరిని ఆకట్టుకునేలా ఈ సినిమాని రాజమౌళి తీర్చి దిద్దుతాడు అనిపిస్తోంది.  విశ్వ వ్యాప్తంగా ఈ సినిమా 3000-4000 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.