రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేయక పోవడంతో అభిమానులు కొంత నిరుత్సహానికి గురయ్యారు. అయితే ఈ రోజు రాజాసాబ్ 2.0 ట్రైలర్ ను విడుదల చేశారు. రాజాసాబ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు దర్శకుడు మారుతి.
రాజాసాబ్ ట్రైలర్ హైలైట్స్
- ప్రభాస్ నటించిన గత చిత్రాలు బాహుబలి, కల్కి, సలార్, ఆదిపురుష్ లలో ప్రభాస్ వేరు, ఈ రాజాసాబ్ లో ప్రభాస్ వేరు. ముఖ్యంగా 15 ఏళ్ళ క్రితం ప్రభాస్ ని అభిమానులకు చూపించాడు దర్శకుడు మారుతి
- ప్రభాస్ కామెడీ టైమింగ్ ని చూపించాడు. ప్రభాస్ కామెడీ టైమింగ్ కు, హారర్ అండ్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు
- ప్రభాస్ మాస్ అండ్ యాక్షన్ ఎలెమెంట్స్, హారర్ ఎలెమెంట్స్
- ట్రైలర్ చివరలో హారర్ అవతార్ ప్రభాస్ (ప్రభాస్ చెప్పిన డిఫరెంట్ క్లైమాక్స్ బహుశా ఇదే కావచ్చు)
- ప్రభాస్ తాతగా సంజయ్ దత్ నటించడం
- రక రకాల వింత ప్రాణులను సృష్టించాడు.
- విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు దర్శకుడు మారుతి.
సంక్రాంతి పండగ సినిమాకు ఇంత కన్నా కావలసిన ఎలెమెంట్స్ ఏముంటాయి. మూడు సంవత్సరాలు సినిమా తీసినా, 500 కోట్లు ఖర్చు పెట్టినా సినిమా హిట్ అయితే ఎవరు పట్టించుకోరు. ప్రభాస్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా 1000 కోట్లు గ్యారంటీ. అందులో ఈ సారి సంక్రాంతి పండగకు వస్తున్నాడు.
రాజాసాబ్ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో ఫ్యాన్స్ కి వదిలేశాడు మన డార్లింగ్ ప్రభాస్.
అయితే ట్రైలర్ మొత్తం చూస్తే మారుతి శైలి వినోదం మిస్ అయ్యింది. హారర్ ఎలెమెంట్స్ డామినేషన్ ఎక్కువగా ఉంది.

