అప్పలసూరి పాత్రలో జగ్గు భాయ్ ; గుర్తుపట్టలేదు బ్రో

by | Dec 29, 2025 | సినిమా

రామ్ చరణ్, జాహ్నవి కపూర్ లు జంటగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం పెద్ది.   ఈ చిత్రం నుండి సర్ ప్రైజ్ ఎలిమెంట్ వదులుతూనే ఉన్నాడు మన దర్శకుడు బుచ్చిబాబు.

పెద్ది చిత్రం నుండి వచ్చిన మొదటి షాట్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే.  ఆ తరవాత చికిరి చికిరి సాంగ్ ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.  ఇప్పుడు పెద్ది చిత్రం నుండి జగపతి బాబు పాత్ర తాలూకా అప్పలసూరి లుక్ ను విడుదల చేశారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు ను ఎవరు గుర్తు పట్టలేనంతగా ఉన్నాడు.

జగపతి బాబు కెరీర్లో అప్పల సూరి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు దర్శకుడు బుచ్చిబాబు

వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ స్వర సారధ్యం వహిస్తున్నారు.  పెద్ది సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27, 2026 విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇటీవలే దర్శకుడు బుచ్చిబాబు, కెమరామెన్ రత్న వేలు బాలీవుడ్ దిగ్గజ నటుడు బోమన్ ఇరానీ తో దిగిన ఫోటో ను షేర్ చేసుకున్నారు. త్వరలో బోమన్ ఇరానీ లుక్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి