భారత, శ్రీ లంక మహిళ టి 20 క్రికెట్ సిరీస్ లో ఇప్పటికే 3-0 తో సిరీస్ గెలుచుకున్న భారత మహిళల జట్టు నాలుగవ టి 20 మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో రెండు వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత మహిళల జట్టు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మ్రితి మందన మొదటి వికెట్ కు ధాటిగా ఆడుతూ 162 పరుగులు జోడించారు. 46 బంతుల్లో 79 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, 48 బంతుల్లో 80 పరుగులు చేసిన స్మ్రితి మందన ఇద్దరు వెంట వెంటనే అవుట్ అయ్యారు.
ఆ తరవాత వచ్చిన రిచా ఘోష్ కేవలం 16 బంతుల్లో, మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ 10 పరుగులతో అజేయంగా నిలిచింది
భారత మహిళల జట్టు ఇన్నింగ్స్ లో ఎనిమిది సిక్సర్లు, 28 బౌండరీలు ఉన్నాయి.

