దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. అన్ని భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. సినిమాలో మహేష్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చూడని కొత్త లుక్‌తో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. కెన్యాలో ఎక్కువ భాగం షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. ఫిబ్రవరి మూడవ వారంలో మొదలు కానున్న కొత్త షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా పాత్రలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రియాంక చోప్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర పోషించనునట్లు తెలుస్తోంది. లేడీ విలన్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ బ్యూటీ కనిపించనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పాత్రను పక్కాగా ప్లాన్ చేసిన రాజమౌళి.. ప్రియాంక పాత్రను కొన్ని నెగిటివ్ షేడ్స్ తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి రాజమౌళి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఎంతో స్పెషల్ గా ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే మహేష్ సినిమా కోసం రాజమౌళి స్క్రిప్ట్ ను పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

