‘అఖండ 2’ బిగ్ అప్‌డేట్.. ప్లాన్‌ మామూలుగా లేదుగా!

by | Feb 13, 2025 | సినిమా

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

కాగా, ‘అఖండ’లో బాలయ్య శివ భక్తుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండో భాగంలోనూ ఆయన తన మార్క్ చూపిస్తూ మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించనుండగా.. ఒక పాత్ర నెగిటివ్ అని మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది. ‘అఖండ-2’ మూవీ ఇంటర్వెల్ పార్ట్ ముందుగానే బాలయ్య రెండో పాత్ర ఎంట్రీ ఉంటుందని అఖండ-2 సినిమా మొత్తానికే ఇదే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో పాటుగా యంగ్ హీరో, విలక్షణ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటించనునన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ‘అఖండ 2’ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో ఆది పినిశెట్టి చేరగా.. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను బాలయ్య-ఆది పినిశెట్టిలపై తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అభిమానులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతున్నారు.