సీనియర్ నటి పుష్పలత ఇక లేరు

by | Feb 5, 2025 | సినిమా

దక్షిణ భారత నటి పుష్పలత దీర్ఘకాలిక అనారోగ్యంతో చెన్నైలో 87 సంవత్సరాల వయసులో మరణించారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో 100 కి పైగా చిత్రాలతో, ఆమె పరిశ్రమకు నిజమైన ఐకాన్.

పుష్పలత గారు రజనీకాంత్, కమల్ హాసన్, ఏం జి రామ చంద్రన్ , శివాజీ గణేశన్ ల తో తెర పంచుకున్నారు

నటుడు, నిర్మాత అయిన ఏ వి ఏం రాజన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. తమిళ నటి మహాలక్ష్మి వీరి కుమార్తె

పుష్పలత గారు భరత నాట్యంలో శిక్షణ పొందారు. నిర్మాత గా కూడా రెండు చిత్రాలను నిర్మించారు.  అయితే ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి

పుష్పలత గారు చెరపకురా చెడేవు చిత్రం తో తెలుగులో అడుగు పెట్టారు.  ఆ తరవాత ఆడ బిడ్డ, వేటగాడు, కొండవీటి సింహం, విక్రమ్, ఉక్కుమనిషి  వంటి తదితర చిత్రాలలో నటించారు

తమిళం లో ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.

ఆమె పరిశ్రమకు నిజమైన ఐకాన్. పుష్పలత గారి కుటుంబ సబ్యులకు మా ప్రగాఢ సానుభూతి