అల్లు అర్జున్ కు  Spokesperson – సరి కొత్త సినిమా ట్రెండ్

by | Feb 5, 2025 | సినిమా

సాధారణంగా  రాజకీయ పార్టీలకు, పెద్ద, పెద్ద సంస్థలకు Spokesperson ఉంటారు.  ఎందుకంటె, ఆ పార్టీ ల తరపున, ఆ ఆర్గనైజషన్ తరపున, ఆ సంస్థల తరపున ఈ Spokesperson మాట్లాడతారు.

కానీ మొదటి సారి హీరో అల్లు అర్జున్ Spokesperson ని నియమించుకుంటున్నారు అని బన్నీ వాస్ చెప్పారు.  అల్లు అర్జున్ సినిమాల గురించి Spokesperson త్వరలోనే మాట్లాడతారు అని చెప్పారు.

మనం ఒకసారి అల్లు అర్జున్ స్పీచ్ లను గమనిస్తే మొదటగా పుష్ప-2 కు సంబంధించిన ఒక ఈవెంట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి వేరే పేరు తో పిలవడంతో పెద్ద దుమారం రేగింది. అల్లు అర్జున్ ఆ తడబాటును కవర్ చేసుకునే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ తర్వాత సంధ్య థియేటర్ లో మృతి చెందిన రేవతి కుటుంబానికి పరిహారం ఇచ్చేటప్పుడు goodwill gesture కింద 25 లక్షలు ఇస్తున్నాము అని ప్రకటించారు. అసలు అనే పదం యెక్క వాడాలో తెలియదు అని నెట్టింట్లో ట్రోల్స్ కి గురయ్యాడు అల్లు అర్జున్. 

ఆ తరవాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన దానికి కౌంటర్ గా అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో పెట్టిన ప్రెస్ మీట్ కూడా బ్యాక్ ఫైర్ అయ్యింది. 

వీటన్నింటి పైన, సోషల్ మీడియా లో అల్లు అర్జున్ మీద మీమ్స్, ఆర్టికల్స్ వచ్చారు.  అంతే కాకుండా, అల్లు అర్జున్ స్పీచ్ ల వాళ్ళో, యాక్షన్స్ వాళ్ళో ఒక రోజు రాత్రి అంత జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

అహంకారంతో కూడిన అసహజమైన స్పీచ్ లు అల్లు అర్జున్ వ్యక్తిగత ఇమేజ్ ను బాగా దెబ్బ తీశాయి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.  రేవతి కొడుకు శ్రీ తేజ రెండు నెలలు గా ఆస్పత్రిలో ఉన్నాడు.  ఈ మధ్య బన్నీ వాస్ అవసరమైతే అన్ని ఫార్మాలిటీస్ చూసుకుని శ్రీ తేజ్ ను చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకువెళతం  అన్నట్లు చెప్పాడు

ఇలా అనేక రకాలుగా అల్లు అర్జున్ తన స్పీచ్ లతో వివాదాలకు కారణమయ్యాడు.  పుష్ప-2 కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్న అల్లు అర్జున్ వ్యక్తిగత ఇమేజ్ ని బాగా డామేజ్ చేసింది ఎంతగా అంటే పుష్ప-2 సక్సెస్ ని సైతం గట్టిగా సెలెబ్రేట్ చేసుకోలేకపోయేంత

తారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకున్నా  (పుష్ప-2 కన్నా ముందు) అది కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకునే.  ఇప్పుడు ఫ్యాన్ మీట్ నిర్వహించబోతున్నా తారక్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నట్లుగా నిన్ననే ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటించింది

పబ్లిక్ లో ఎలా మాట్లాడాలి అనే దానిపై అల్లు  అరవింద్ అనుభవం అల్లు అర్జున్ కు ఉపయోగపడలేదనే చెప్పాలి

పబ్లిక్ లో మాట్లాడాలన్నా, సినిమా ఫంక్షన్ లు చేయాలన్న అందరు భయపడుతున్నారు.   శ్రీ తేజ్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో అనవసర వివాదాలకు దూరంగా ఒక Spokesperson ని పెట్టుకోవడం మంచిదే.  అయితే ఈ Spokesperson కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమా లేక జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ తగ్గట్టుగా ఉంటారో తెలియాలి

దీనివల్ల హీరో కి, అభిమానుల కు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది.  గ్లామర్ ఇండస్ట్రీలో ఇది అంత మంచి ఐడియా కాకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ ప్లాన్ ఏముందో మనకు తెలియదు. జాతీయ స్థాయిలో ఈ Spokesperson ని ఉపయోగించుకుంటే మంచిదే.  ఒక వేళ రాజకీయ అరంగేట్రం చేసినా ఉపయోగపడుతుంది

ఈ మధ్య అల్లు అర్జున్ మాత్రమే కాదు చాల మంది సినిమా వాళ్ళు పబ్లిక్ స్పీచ్ లు ఇచ్చేటప్పుడు నోరు జారుతున్నారు. దిల్ రాజు, శ్రీ ముఖి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. అల్లు అర్జున్ ఐడియా ఫాలో అవుతారేమో వీళ్ళు కూడా

ఒక్కొక్కసారి సీనియర్ నిర్మాతలు కూడా ఫ్లో లో మాట్లాడినవి పరోక్షంగా అభిమానులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి