ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులందరిని వెనక్కి పంపిస్తునాడు. అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టిన వలసదారులపై డోనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపుతున్నాడు
టెక్సాస్ నుండి బయలుదేరిన అమెరికా విమానం ఈ రోజు మధ్యాన్నం 1:55 గంటలకు పంజాబ్ లోని అమృతసర్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఈ విమానంలో 104 మంది భారతీయులు ఉన్నారు
ఈ 104 మందిలో ఎక్కువగా పంజాబ్, గుజరాత్ కు చెందినవారే. దక్షిణ భారతీయులు ఎవరు లేరు
అయితే, వీళ్ళందరూ అక్రమంగా అమెరికా ఎలా వెళ్లారు. వీళ్ళని పంపించిన కన్సల్టెన్సీ లు ఎవరు అనే విషయాలపై ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ చేయవలసి ఉంది
20,400 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళందరిని ఇండియా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 17900 మందిని వెనక్కి పంపేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారని సమాచారం
ట్రంప్ నిర్ణయం ఎలా ఉన్న, అంత మంది భారతీయులు అక్రమంగా అమెరికాల ఉంటున్నారు అంటే అది దేశానికే అవమానం. ఇప్పటికైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవరించాలి
వచ్చేవారం మన ప్రధాని మోడీ, ట్రంప్ ని కలవబోతున్నారు.

