ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన పుష్ప- 2 ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం, అంటే ఏప్రిల్ 13 న స్టార్ మా లో సాయంత్రం 5.30 గంటలకు ప్రసారమవుతోంది. ఇదే ఏప్రిల్ 13 న, పుష్ప-2 మలయాళం వెర్షన్ ఆసియానెట్ లో, కన్నడ వెర్షన్ కలర్స్ కన్నడ లో ప్రసారమవుతోంది. ఏప్రిల్ 14 న, తమిళ్ వెర్షన్, స్టార్ విజయ్ లో ప్రసారమవుతుంది.
పుష్ప పార్ట్, 22 రేటింగ్ పాయింట్ లు సాధించింది. ఈ లెక్కన పుష్ప -2 ఎలాంటి భారీ రేటింగ్ తీసుకు వస్తుందో చూడాలి. అయితే జీ తెలుగు వారు పుష్ప-2 కి కౌంటర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెకండ్ టెలికాస్ట్ చేస్తున్నారు.
రికార్డు రేటింగ్ పై కన్నేసిన స్టార్ మా పుష్ప-2 ని, జీ తెలుగు సంక్రాంతి కి వస్తున్నాం అడ్డుకుంటుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి
పుష్ప-2 వివాదాలలో చిక్కుకుంది. అంతే కాకుండా, పుష్ప 2 బాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యింది. మరి టెలివిజన్ లో ఎలాంటి రేటింగ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

