దురంధర్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ లో మరియు హిందీ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ ఇప్పటికే రికార్డు సృష్టించింది.
అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా పుష్ప-2 రికార్డు ని బ్రేక్ చేసిన దురంధర్ ఇప్పుడు ఓవర్సీస్ వసూళ్ళలో కూడా పుష్ప 2 రికార్డు ని బ్రేక్ చేసింది. దురంధర్ ఓవర్సీస్ వసూళ్లు 284.10 కోట్లు కాగా పుష్ప-2 ఓవర్సీస్ వసూళ్లు 270.65 కోట్లు మాత్రమే.
39 రోజులకు, దురంధర్ ఇండియా నెట్ వసూళ్లు 860 కోట్లు. ఇండియా గ్రాస్ వసూళ్లు 1011 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా దురంధర్ 1296 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక్క భాషలో విడుదలై (హిందీలో) అది కూడా మిడిల్ ఈస్ట్ విడుదల కాకుండానే. మిడిల్ ఈస్ట్ లో విడుదల కాకపోయినా దురంధర్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా లు నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యుగంధర్ చిత్రానికి దర్శకుడు ఆదిత్య ధర్. కొంతమంది ప్రత్యేకంగా దుబాయ్ నుండి ఢిల్లీ కి ఫ్లైట్ లో వచ్చి ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది
దురంధర్ పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


