ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇటీవల సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా చివరిలో పార్ట్ 3 ఉండబోతుందంటూ చిత్రబృందం హింట్ ఇచ్చి వదిలేసింది. పుష్ప 3 (Pushpa) ది ర్యాంపేజ్ అంటూ 3వ భాగం రాబోతుండగా.. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అనే డౌట్ అటు అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులకు కూడా కలిగింది. అయితే పుష్ప 2 సినిమాకు మరో సీక్వెల్‌గా పుష్ప -3 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ గా తెరకెక్కనున్న ఈ సినిమాను 2028లో విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్రపై సరికొత్త న్యూస్ వైరల్ గా మారింది. దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ సినిమా స్క్రిప్ట్ మరింత పవర్‌ఫుల్‌గా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో ఇద్దరు విలన్లను పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం విజయ్ దేవరకొండ, నాని (Nani) పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ (Vijaya Devarakonda), నానిలని విలన్ పాత్రల కోసం సుకుమార్ సంప్రదించినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు గాని పుష్ప-3లో అల్లు అర్జున్ ఢీకొట్టే విలన్ పాత్రల్లో విజయ్ దేవరకొండ, నానిలు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ‘పుష్ప’ (Pushpa) ఫ్రాంచైజీలో భాగంగా 2021లో ‘పుష్ప ది రైజ్’ తెరకెక్కింది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. అనంతరం దీనికి సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కగా.. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కాగా, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక (Rashmika) మందన్నా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

