టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18 న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగానే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ
ఈ సినిమా కు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఎపిసోడ్ ని ఎన్టీఆర్ అర్స్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్, విజయ శాంతి గారు, అనిల్ రావిపూడి గారు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని సుమ ఇంటర్వ్యూ చేసింది.
అనిల్ రావిపూడి మొదటి సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన పటాస్. ఈ సినిమా సూపర్ హిట్. అలాగే చాలా సంవత్సరాల తరవాత విజయ శాంతి గారిని వెండి తెరమీదకు తీసుకు వచ్చిన ఘనత కూడా అనిల్ రావిపూడి గారికి దక్కుతుంది. సరిలేరు నీకెవ్వరూ చిత్రం ద్వారా మళ్ళీ విజయ శాంతి గారి రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమయింది. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ లో నటించారు. అందులోనూ విజయ శాంతిగారికి జాతీయ అవార్డ్ తెచ్చిపెట్టిన పోలీస్ ఆఫీస్ పాత్రలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి లో నటించారు
ఇందులో సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

