డిసెంబర్ 5, 2024 లో విడుదలై పుష్ప-2 (Pushpa-2) సృష్టించిన రికార్డులను డిసెంబర్ 5, 2025 లో విడుదలైన దురంధర్ బద్దలు కొట్టబోతోంది అనేది వాస్తవం. అల్లు అర్జున్ (Allu Arjun) సెట్ చేసిన అంత పెద్ద రికార్డు ఒక సంవత్సరంలో బద్దలు అవుతుంది అని ఎవరు ఊహించలేదు. కానీ ఇది వాస్తవం.
సైలెంట్ గా వచ్చి ఒకే భాషలో విడుదలై, గల్ఫ్, పాకిస్థాన్ వంటి దేశాలలో నిషేధించినా దురంధర్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దురంధర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో చూసేద్దాం.
31 రోజులలో, ప్రపంచ వ్యాప్తంగా 1240 కోట్లతో, , 820 కోట్ల ఇండియా నెట్ వసూళ్లతో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది దురంధర్. 800 కోట్ల వసూలు సాధించిన మొదటి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది దురంధర్ (Pushpa 2 హిందీ భాషలో వచ్చిన తెలుగు సినిమా). ఇంకా 16 కోటు వసూళ్లు సాధిస్తే పుష్ప-2 (Pushpa) రికార్డు కూడా బద్దలవడం ఖాయం. పూర్తి రన్ లో దురంధర్ 875-900 కోట్ల వసూళ్లు సాధించవచ్చని సినీ పండితుల అభిప్రాయం.
మరికొన్ని దురంధర్ (Durandhar) రికార్డులు
- నార్త్ అమెరికాలో No.1 హిందీ ఫిల్మ్
- నార్త్ అమెరికాలో No.2 ఇండియన్ ఫిల్మ్
- కెనడా, ఆస్ట్రేలియా లో No.1 ఇండియన్ ఫిల్మ్
- యూకే లో No.4 ఇండియన్ ఫిల్మ్
దురంధర్ ఇండియా బాక్స్ ఆఫీస్ బ్రేకప్
- మొదటి వారం : 218.00 కోట్లు
- రెండవ వారం : 261.50 కోట్లు
- మూడవ వారం : 189.30 కోట్లు
- నాలుగవ వారం : 115.70 కోట్లు
- ఐదవ వారం : 35.8 కోట్లు (మూడు రోజులకు)
టోటల్ ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు: ₹272 కోట్లు ( 30.5 మిలియన్ యుఎస్ డాలర్లు)
రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా లు నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యుగంధర్ చిత్రానికి దర్శకుడు ఆదిత్య ధర్. కొంతమంది ప్రత్యేకంగా దుబాయ్ నుండి ఢిల్లీ కి ఫ్లైట్ లో వచ్చి ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది
దురంధర్ పార్ట్ 2 – రివెంజ్ ను మార్చ్ 19, 2026 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బాషలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు

