‘మన శంకర వర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad garu) చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో ఎస్ వి సినీప్లెక్స్ లో జరిగింది. ట్రైలర్ చివర్లో వెంకటేష్, చిరంజీవి ల మధ్య సంభాషణలు మంచి హైప్ ని తీసుకు వచ్చాయి. మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతోంది.
మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7 న హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కు మెగా విక్టరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఇద్దరు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటిదాకా ఈ చిత్రం నుండి మూడు పాటలు విడుదల చేశారు. చిరంజీవి (Chiranjeevi) ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం విడుదల చేయలేదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, ఆట సందీప్ ని పిలిచి ఈ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. తన అభిమాన హీరో కు సందీప్ ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేశారని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహిస్తున్నారు. జనవరి 12 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. జనవరి 11 రాత్రి నుండి ప్రీమియర్ సందడి మొదలవుతోంది.


