యాషెస్ సిరీస్ (Ashes Series) లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 384 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.
రెండవ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే 84 పరుగులు చేసిన బ్రూక్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ స్టోక్స్ డక్ అవుట్ అయ్యాడు. అయితే రూట్, జేమీ స్మిత్ లు ఆరవ వికెట్ కు 94 పరుగులు జోడించారు. స్మిత్ 46 పరుగులు, విల్ జాక్స్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
రెండవ రోజు ఆటలో రూట్ భారీ సెంచరీ హైలైట్. 160 పరుగులు చేసిన రూట్ తొమ్మిదవ వికెట్ గా వెను తిరిగాడు
ఆస్ట్రేలియా బౌలర్లలో నెజర్ నాలుగు వికెట్లు తీయగా, స్టార్క్, బొలాండ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. గ్రీన్, లబుషేన్ లు చెరో ఒక వికెట్ తీశారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా కు ఓపెనర్లు హెడ్, వెథరాల్డ్ లు మొదటి వికెట్ కు 57 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 21 పరుగులు చేసిన వెథరాల్డ్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన లబుషేన్, హెడ్ తో కలిసి రెండవ వికెట్ కు 105 పరుగులు జోడించారు. లబుషేన్ 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా కోల్పోయిన రెండు వికెట్లు స్టోక్స్ కి దక్కాయి. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి హెడ్ (Travis Head) 91 పరుగులతో, నెజర్ ఒక పరుగుతో క్రీజ్ లో ఉన్నారు
రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (Australia) మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 218 పరుగులు వెనకబడి ఉంది. ఇంకా చేస్తిలో 8 వికెట్లు ఉన్నాయి

