ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ, మహాకుంభ మేళా కు నరేంద్ర మోడీ

by | Feb 5, 2025 | వార్తలు

కేంద్రం లో అధికారం లో ఉన్నా, 1998 తరవాత ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోయింది భాజపా.  ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భాజపా సర్వ శక్తులు వడ్డీ పోరాడుతోంది. 

ఈ రోజు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, రాహుల్ గాంధీ ఢిల్లీ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళాకు వెళుతున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం లో నేరుగా ప్రయాగరాజ్ కు చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ రోజు ఉదయం 11గంటలకు త్రివేణి సంగమంలో మోడీ స్నానమాచరించి ఆ తరవాత గంగా దేవి కి పూజలు చేస్తారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆ  గంగమ్మ తల్లి  ఆశీస్సుల కోసం మహాకుంభమేళా కు వస్తున్నారు  మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.  ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల్ 8 న జరుగుతుంది