లక్కీ భాస్కర్ టెలివిజన్ లో కూడా సూపర్ హిట్

by | Feb 5, 2025 | టీవీ & ఓటిటి

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ గత దీపావళి కి విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.  దుల్కర్ సల్మాన్ కు మహానటి, సీతారామం ల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ హిట్ ఈ లక్కీ భాస్కర్.  బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు 110 కోట్లు వసూలు చేసిందని సమాచారం. 

ఈ సినిమా గత వారం  స్టార్ మా లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా బ్రాడ్ కాస్ట్ చేశారు.  లక్కీ భాస్కర్ ప్రీమియర్ స్టార్ మా 10.2 రేటింగ్ సాధించింది. 

డబల్ డిజిట్ రేటింగ్ అంటే సూపర్ హిట్ అని చెప్పవచ్చు. గుంటూరు కారం, హనుమాన్ చిత్రాల రేంజ్ లో రేటింగ్ సాధించింది. ఇటీవలే జీ తెలుగు లో కల్కి ప్రీమియర్ కూడా 5.4 రేటింగ్ మాత్రమే సాధించింది

స్టార్ మా వారు దీనికి సంబంధించిన క్రియేటివ్ లింకెడిన్ లో పోస్ట్ చేశారు