ప్రభాస్‌ ‘బక’.. ప్రశాంత్‌ వర్మ స్కెచ్ నెక్ట్స్‌ లెవల్‌ !

by | Mar 10, 2025 | సినిమా

‘హను- మాన్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునన్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుండగా.. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇటీవలే ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌ చేసిన మేకర్స్ అదిరిపోయే లుక్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మైథ‌లాజిక‌ల్ మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కు ‘బక’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం. అయితే ఈ టైటిల్ చూసిన ప్రభాస్ అభిమానులు మాత్రం ఇదేం టైటిల్ అంటూ షాకవుతున్నారు. అయితే మహాభారతంలోని బకాసురుడు అనే రాక్షసుడు పాత్రను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ వర్మ కథ రాశాడని, అందుకే ఈ సినిమాకు ‘బక’ అని టైటిల్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్‌ (Prabhas) ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో ‘ది రాజాసాబ్‌’, హను రాగవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటుగా మే నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’(Spirit) షూటింగ్‌ని మొదలుపెట్టనున్నారట ప్రభాస్‌. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక ప్రశాంత్ వర్మతో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.