ఛాంపియన్స్ ట్రోఫీ బ్యాటింగ్ హీరో : ఆపద్బాంధవుడు శ్రేయాస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ని మూడోసారి గెలుచుకుంది.
ఈ సందర్భంలో మనం టోర్నీ ఆసాంతం నిలకడైన ఆట తీరును కనపరచిన శ్రేయాస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి
ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.(Shreyas Ayyar) శ్రేయాస్ 5 మ్యాచ్ ల లో రెండు అర్ధ సెంచరీలతో 243 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 218 పరుగుల తో రెండవ స్థానంలో ఉన్నాడు
శ్రేయాస్ అయ్యర్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులే చేసి అవుట్ అయ్యినప్పటికీ, ఆ తరవాత నాలుగు మ్యాచ్ లలో నిలకడైన ఆట తీరుతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తో మూడవ వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ చేసిన పరుగులు- 56
గ్రూప్ స్టేజి లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ తో నాలుగవ వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతే కాక రాహుల్ తో కలిసి ఐదవ వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ 79 పరుగులు చేశాడు
ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ లో విరాట్ కోహ్లీ తో కలిసి శ్రేయాస్ అయ్యర్ 91 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు చేశాడు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ మీద శ్రేయాస్ అయ్యర్ (Shreyas Ayyar) నాలుగవ వికెట్ కు అక్షర్ పటేల్ తో కలిసి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేశాడు
భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ లో మిస్టర్ డిపెండబుల్ (Mr Dependable) బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్

