పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చివరిగా ‘ది రాజాసాబ్’ (Raja Saab) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ (Spirit) తో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ (Fouji) చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘సలార్ 2: శౌర్యాంగ పర్వ’ . ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఈ మూవీ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మాత్రం ‘సలార్ 2’ను త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ మూవీ టీజర్ (Teaser) కు డేట్ ఫిక్సయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘సలార్ 2’ (Salaar) సినిమా టీజర్ ఈ జనవరి 25న రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాస్ అక్టోబర్‌లోనే సలార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారని వార్తలు వినిపించాయి. ఈ షెడ్యూల్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ (Prabhas) తో పాటుగా పృథ్విరాజ్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ‘సలార్ 2’లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


