టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దుమ్మురేపుతోంది. చిరంజీవి మార్క్ గ్రేస్ కు తోడుగా వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ జతకలవడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన కేవలం 9 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్లో చేరింది.
ఈ నేపథ్యంలోనే ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు చిరంజీవి మేనల్లుడు అగ్ర హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. “ఇప్పుడే ‘మనశంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా చూశాను మూవీ ఆధ్యంతం అద్భుతంగా సాగింది. చిరంజీవి గారు మళ్లీ అదరగొట్టేశారు. వెంకటేశ్ (Venkatesh) , నయనతార, కేథరిన్, బుల్లిరాజు చాలా బాగా నటించారు. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో శుభాకాంక్షలు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన సంక్రాంతికి వస్తారు సూపర్ హిట్ కొడతారు ఇదే రిపీట్ చేస్తారు. అలాగే నిర్మాతలు సుష్మిత, సాహు గారపాటికి శుభాకాంక్షలు. ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు సంక్రాంతి ‘బాస్’ బస్టర్. ఈ గొప్ప చిత్రంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక అభినందనలు.” అంటూ అల్లు అర్జున్ (Allu Arjun( రాసుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోవడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ జోరు చూస్తుంటే మరికొన్ని రోజులు ‘మనశంకర వరప్రసాద్‌గారు’ సినిమా విధ్వంసం ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు.

